- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అలా జోస్యం చెప్పారని.. ఇద్దరు జ్యోతిష్యుల అరెస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : ఇద్దరు చిరు జ్యోతిష్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకో తెలుసా ? ఎన్నికల్లో ఓ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు అని జోస్యం చెప్పినందుకు !! ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటుచేసుకుంది. కడలూరు లోక్‌సభ స్థానం నుంచి పట్టలి మక్కల్ కచ్చి (పీఎంకే) అభ్యర్థిగా పోటీ చేస్తున్న థాంకర్ బచన్ .. కడలూరు సమీపంలోని తెన్నంపాక్కం వద్దనున్న అళగు ముత్తు అయ్యనార్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ రోడ్డుపక్కన కూర్చొని ఉన్న ఇద్దరు చిలక జ్యోతిష్యులను థాంకర్ బచన్ కలిశారు. ఈ ఎన్నికల్లో తన పరిస్థితేంటో చెప్పాలని వారిని అడిగారు. చిలకతో ఒక కార్డును తీయించిన జ్యోతిష్యులు.. ఏప్రిల్ 19న జరగబోయే కడలూరు లోక్‌సభ ఎన్నికల్లో థాంకర్ బచన్ గెలుస్తారని జోస్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు వచ్చి ఇద్దరు చిరు జ్యోతిష్యులను అరెస్టు చేశారు. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందున రెండు బోన్లలో ఉంచిన నాలుగు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ జ్యోతిష్యులకు వార్నింగ్ ఇచ్చి పోలీసులు వదిలేశారు. ఈ అరెస్టులను పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రామదాస్ ఖండించారు. కాగా, తమిళనాడులోని ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు పీఎంకే కూడా ఉంది.