- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలింగ్ స్టేషన్ లో పారామిలిటరీ సిబ్బంది డెడ్ బాడీ..!
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని పోలింగ్ స్టేషన్ వాష్‌రూమ్‌లో పారామిలటరీ సిబ్బంది డెడ్ బాడీ కలకలం సృష్టించింది. కూచ్ బెహార్ లోని మథభంగాలోని పోలింగ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. పోలింగ్ రోజే ఇలా జరగడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటింగ్ ప్రారంభానికి ముందే సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పృహలేకుండా కన్పించారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వాష్‌రూమ్‌లో జారిపడటంతో.. తలకు గాయమైనట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలిందన్నారు డాక్టర్లు. ఇందులో ఎలాంటి క్రిమినల్ కోణం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. అయితే శవపరీక్ష తర్వాతే మరణం వెనుక మిస్టరీ తెలిసే అవకాశం ఉందన్నారు.
కూచ్‌బెహార్‌లో భారీ భద్రత మధ్య ఓటింగ్ ప్రారంభమైంది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున జగదీష్ బసునియా పోటీ చేయగా.. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎఁపీ నిసిత్ ప్రమాణిక్ బరిలో ఉన్నారు. నార్త్ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ 2021లో రాష్ట్ర ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగాయి. సితాల్‌కుచిలోని పోలింగ్ బూత్ వెలుపల భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఆ తర్వాత, ఎన్నికల సంఘం ఓలింగ్ ను నిలిపివేసింది.
బెంగాల్‌లోని అలీపుర్‌దువార్స్, జల్‌పైగురి స్థానాల్లోను పోలింగ్ కొనసాగుతోంది. ఈ రెండు స్థానాల్లోనూ 2019లో బీజేపీ నేతలే గెలుపొందారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో 22 సీట్లు తృణమూల్ గెలుచుకోగా.. 18 సీట్లను బీజేపీ గెల్చుకుంది.