వాహనాల్లో ఆక్సిజన్ కిట్లు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

by Vinod kumar |
వాహనాల్లో ఆక్సిజన్ కిట్లు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
X

గ్యాంగ్ టక్: వ్యక్తిగత, వాణిజ్య వాహనాలన్నింటిలో పోర్టబుల్ ఆక్సిజన్ సరఫరా కిట్‌లు, డబ్బాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలని సిక్కింగ్ ప్రభుత్వం ఆదేశించింది. ఎత్తయిన ప్రదేశాల్లో ప్రజలు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్న కేసులు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సిక్కిం రవాణా కార్యదర్శి రాజ్ యాదవ్ తెలిపారు. సిక్కింలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. లాచెన్, లాచుంగ్, గురుడోంగ్మార్ లేక్, యుమ్తాంగ్ వంటి పర్యాటక ప్రదేశాలు రాష్ట్రానికి ఉత్తరాన 10 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. హిమాలయ రాష్ట్రానికి తూర్పున ఉన్న త్సోంగో (ఛంగు) సరస్సు, నాథు-లా, బాబా మందిర్ తదితర ప్రదేశాలను సందర్శించే పర్యాటకులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలు శ్వాసకోస సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులందాయి.

Advertisement

Next Story