- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mumbai-Nagpur Highway: ముంబై- నాగపూర్ హైవేపై ఒకేసారి 50 వాహనాలు పంక్చర్
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ముంబై- నాగపూర్ సమృద్ధి హైవేపై (Mumbai-Nagpur Highway) ఏకంగా 50 వాహనాలు ఒకేసారి పంక్చర్(Over 50 Cars Punctured) అయ్యాయి. డిసెంబర్ 29 రాత్రి ఈఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో వాషిం జిల్లాలోని(Washim district) మాలేగావ్ మీదుగా వెళుతున్న కార్లు, ట్రక్కులు.. వరుసగా పంక్చర్ అయ్యాయి. దీంతో రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది. కాగా.. ఎలాంటి సాయం అందకపోవడంతో రాత్రంతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇనుప బోర్డు రోడ్డుపై పడి ఉండడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ లో ప్రమాదం..
ఇకపోతే, ఈ ఏడాది జూన్‌లో జల్నా జిల్లాలోని ఇదే హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. నలుగురికి గాయాలయ్యాయి. ముంబై- నాగ్‌పూర్‌ను కలుపుతూ నిర్మించిన రోడ్డు ఇది. సుమారు 701 కిలోమీటర్ల పొడవున్న ఈ ఆరులేన్ల రోడ్డుని.. దేశంలోని అతి పొడవైన గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. రూ.55 వేల కోట్ల వ్యయంతో రహదారిని ఏర్పాటుచేశారు.