Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 413 మంది మృతి

by Shamantha N |
Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 413 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas)ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు రెడీ అవుతుండగానే.. గాజా (Gaza)పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులకు పాల్పడింది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో జరిపిన ఈ భీకర దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఖాన్‌ యూనిస్‌, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 413 మంది చనిపోయినట్లు గాజా సివిల్‌ డిఫెన్స్‌ ఏజెన్సీ వెల్లడించింది. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఏజెన్సీ పేర్కొంది. ఈ దాడుల కారణంగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో హమాస్‌ పోలీస్‌, ఇంటర్నల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ హెడ్‌ మహ్మద్‌ అబు వత్ఫా కూడా మరణించినట్లు తెలిసింది. మరోవైపు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) కూడా దాడులపై ప్రకటన చేసింది. హమాస్‌ ఉగ్ర ముఠాకు చెందిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే భీకర దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. మరోవైపు, హమాస్‌ నుంచి ప్రతీకార దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గాజా సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేయాలని ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ దాడుల దృష్ట్యా తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆదేశించింది. ఆ ప్రాంతంలో మరిన్ని దాడులు చేపడుతామని హెచ్చరించింది.

ఐడీఎఫ్ ప్రకటన

అటు ఐడీఎఫ్‌ కూడా దీనిపై ప్రకటన చేసింది. హమాస్‌ ఉగ్ర ముఠాకు చెందిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే భీకర దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. మరోవైపు, హమాస్‌ నుంచి ప్రతీకార దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గాజా సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేయాలని ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ దాడుల దృష్ట్యా తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ మిలిటరీ ఆదేశించింది. ఆ ప్రాంతంలో మరిన్ని దాడులు చేపడుతామని హెచ్చరించింది. కాగా.. ఈ దాడులను హమాస్ ఖండించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్‌ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇటీవల ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా.. దాదాపు 30మందికి పైగా తమ చెరలోని బందీలను మిలిటెంట్‌ సంస్థ విడుదల చేయగా.. ప్రతిగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. ఈక్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ఆచర్చలకు రెడీ అవుతుండగానే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం గమనార్హం.

Next Story