దేశ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం.. CM కేజ్రీవాల్‌పై NIA విచారణకు ఆదేశం

by Satheesh |   ( Updated:2024-05-06 13:08:44.0  )
దేశ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం.. CM కేజ్రీవాల్‌పై NIA విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణకు ఆదేశించారు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ నుండి ఆప్‌కు నిధులు అందాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎన్ఐఏకు సిఫారసు చేశారు. ఉగ్రవాదులతో సీఎం కేజ్రీవాల్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐఏ విచారణకు ఆదేశించారు. సీఎం కేజ్రీవాల్‌కు అక్రమంగా నిధులు అందినట్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఈ మేరకు ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు ఎల్జీ తెలిపారు. ఖలీస్థాన్ నేత దేవేంద్ర భుల్లర్ విడుదల కోసం ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం కేజ్రీవాల్‌పై ఎన్ఐఏ విచారణకు ఆదేశించడం దేశ రాజకీయాల్లో సంచనలంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed