ముస్లింలను రెచ్చగొడుతున్నారు.. ఇండియా కూటమిపై ఎస్బీఎస్పీ చీఫ్ ఫైర్

by Shamantha N |
ముస్లింలను రెచ్చగొడుతున్నారు.. ఇండియా కూటమిపై ఎస్బీఎస్పీ చీఫ్ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఇండియా కూటమిపై ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భర్ నిప్పులు చెరిగారు. సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని లోక్ సభ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఓంప్రకాష్ బరిలో దిగారు. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగానే బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందన్నారు. జూన్ 8న ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణం చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ గెలుపు ఖాయమని.. ఇండియా కూటమి నేతలు దుబాయ్, ఇటలీలకు వెళ్లారని సెటైర్లు వేశారు.

ముస్లింల మద్దతు కాషాయ పార్టీకే..

కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఓం ప్రకాశ్ మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కలిసి.. ముస్లింలకు రిజర్వేషన్లు తగ్గించారని ఆరోపించారు. ముస్లింలలో బీజేపీపై ద్వేషాన్ని నింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల కోసం పనిచేస్తున్న వ్యక్తి మోడీ అని కొనియాడారు. ముస్లింలు కూడా కాషాయపార్టీకే మద్దతు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జూన్ 4న ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటుతుందని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story