జడ్జిలను సోషల్ మీడియాలోనూ దూషించొద్దు: సుప్రీం కోర్టు

by Vinod kumar |
జడ్జిలను సోషల్ మీడియాలోనూ దూషించొద్దు: సుప్రీం కోర్టు
X

న్యూఢిల్లీ: న్యాయమూర్తులను సామాజిక మాధ్యమాల్లోనూ దూషించకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఓ జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన నిందితుడు కృష్ణ కుమార్ రఘువంశీ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ బేల ఎం. త్రివేది, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన వెకేషన్ బెంచ్ తెలిపింది.

ఓ ఆలయానికి సంబంధించిన వివాదంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించిన రఘువంశీ కోర్టు ప్రతిష్టను కించపరిచే పోస్టులను వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.

Advertisement

Next Story

Most Viewed