Vinesh Phogat: ప్రజల దృష్టిలో విజేతగా ఉండటం కంటే పెద్దది ఏదీ లేదు: వినేష్ ఫొగట్

by S Gopi |   ( Updated:2024-09-09 10:31:18.0  )
Vinesh Phogat: ప్రజల దృష్టిలో విజేతగా ఉండటం కంటే పెద్దది ఏదీ లేదు: వినేష్ ఫొగట్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గంలో గెలుపు తనదేనని స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టిలో విజేతగా ఉండటం కంటే పెద్దది ఏదీ లేదని ఆమె అన్నారు. ఆదివారం హర్యానాలోని జింద్ ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వినేష్ ఫోగట్, ' కాంగ్రెస్ పార్టీ తనకు అభ్యథిగా బాధ్యతలు అప్పగించింది. ప్రజల నుంచి ప్రేమ, మద్దతు లభిస్తోంది. ప్రజలు గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. ఇప్పటికే ప్రజల కళ్లలో తానొక విజేతనని, దీని కంటే పెద్దది ఇంకేమీ ఉండదు' అని విలేకరులతో అన్నారు. జింద్‌లో జరిగిన బహిరంగ సభలో వినేష్ మాట్లాడుతూ.. రెజ్లర్‌లకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. జంతర్ మంతర్ వద్ద మా అందరికీ మద్దతుగా ప్రియాంక గాంధీ వచ్చిన సందర్భం ఇంకా గుర్తుందన్నారు. 'దేశం నాకు చాలా ఇచ్చింది. ఈరోజు తనకు దక్కే గౌరవం రెజ్లింగ్ వల్లనే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. టికెట్ ఇచ్చినందుకు మాత్రమే కాదు.. మేము రోడ్డు మీద కూర్చున్న సమయంలో ప్రియాంక గాంధీ మా వద్దకు వచ్చారు. ధైర్యం కోల్పోవద్దని, రెజ్లింగ్ ద్వారా వారికి సమాధానం చెప్పాలని ఆమె భరోసా ఇచ్చారన్నారు. గతవారం మరో రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి వినేష్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది.

Advertisement

Next Story