ఇకపై సినిమాల్లో అలాంటి సన్నివేశాలకు నో ఛాన్స్!: సుప్రీం కోర్టు

by Ramesh Goud |
ఇకపై సినిమాల్లో అలాంటి సన్నివేశాలకు నో ఛాన్స్!: సుప్రీం కోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇకపై సినిమాల్లో, దృష్యమాధ్యమాల్లో దివ్యాంగులను అవమానపరిచేలా ఉన్న సన్నివేశాలను చిత్రీకరించడానికి వీళ్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దివ్యాంగులపై వాస్తవాలను చూపించేలా చిత్రీకరించాలి. కానీ కించపరిచేలా ఉండకూడదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సోనీ పిక్చర్స్ నిర్మించిన బాలీవుడ్ మూవీ "ఆంఖ్ మిచోలీ" లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలున్నాయని నిపున్ మల్హోత్రా అనే సామాజిక వేత్త పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసం దృష్య మాధ్యమాల చిత్రీకరణపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

దివ్యాంగుడు, స్పాస్టిక్ వంటి పదాలను సినిమాల్లో ఉపయోగించడాన్ని ఖండించింది. ఇలాంటివి వారిని శాశ్వతంగా వివక్షకు గురి చేస్తాయని తెలిపింది. ఈ విషయాల్లో సినిమా స్క్రీనింగ్ కు అనుమతించే ముందు సర్టిఫికేట్ ఇచ్చే సెన్సార్ బోర్డు నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. చిత్రకులు దివ్యాంగులు, అంగవైకల్యం ఉన్న వారిపై జోకులు వేయడం, వారిని అపహస్యం చేసేలా చిత్రీకరించడాన్ని నిరోధించి, దివ్యాంగుల సవాళ్లతో పాటు వారి విజయాలు, ప్రతిభ, సమాజానికి చేసిన సేవలను చూపిస్తే బాగుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.


Advertisement

Next Story