- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రధాని మోడీ ఓడిపోయారు: లాలు ప్రసాద్ కామెంట్స్
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి మాట్లాడుతూ మోడీపై విమర్శలు సంధించారు. ఇది ప్రధాని మోడీ ఓటమేనని స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లుతున్న లాలు యాదవ్ పాట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా, జమ్ము కశ్మీర్‌లో బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయని, ఇది మోడీ పరాజయమేనని అన్నారు.
హర్యానాలో బీజేపీ అధికారాన్ని కోల్పోనుందని, కాంగ్రెస్ మెజార్టీ సీట్లు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. జమ్ము కశ్మీర్‌లో హంగ్ ఏర్పడే చాన్స్ ఉన్నదని, అందులోనూ బీజేపీ కంటే కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికే మెజార్టీ సీట్లు దక్కుతాయని అంచనాలు వచ్చాయి.