Ap News: ప్లాన్ వేశారు.. ఫెయిల్ అయ్యారు..!

by srinivas |   ( Updated:2024-10-06 13:26:10.0  )
Ap News: ప్లాన్ వేశారు.. ఫెయిల్ అయ్యారు..!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో కల్తీ జరిగి ఉంటే సీఎం చంద్రబాబు(CM Chandrababu) చెప్పింది కరెక్టేనని, కానీ గాల్లో అద్ధాల మేడలు కట్టి వైఎస్ జగన్‌(YS Jagan)ను క్లోజ్ చేద్దామని ఎత్తు వేశారని, తిరిగి ఆయనకే కొట్టిందని మాజీ ఎంపీ హర్ష కుమార్(Former MP Harsha Kumar)అన్నారు. తిరుమల, అన్నవరం లడ్డూలు చాలా బాగుంటాయని, ఇటీవల తాను కూడా తిన్నానని, కానీ అప్పటికీ, ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదని ఆయన తెలిపారు. నిజంగా కల్తి జరిగి ఉంటే సిట్ కంటే ముందే సీబీఐ దర్యాప్తు కోరితే బాగుండేదన్నారు. లడ్డూ విషయంలో చంద్రబాబు తొందరపడి సిట్ వేశారన్నారు. అందుకే సుప్రీంకోర్టు అంగీకరించలేదని చెప్పారు. సీబీఐ డైరెక్షన్‌లో విచారణ జరపాలని కోర్టు ఆదేశించిందని హర్షకుమార్ గుర్తు చేశారు.


సనాతన ధర్మం విషయంలో పవన్ కల్యాణ్, లడ్డూ వ్యవహారంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలినట్టేనని హర్షకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను రెచ్చిగొట్టి ఎదుటి పార్టీలను భూస్థాపితం చేయాలనుకోవడం శుద్ధ పొరపాటని, ప్రజలు పాలనను చూస్తారని చెప్పారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో ఒకటి, రెండు విషయాల్లో తప్ప మిగిలిన వాటిలో ఫెయిల్యూర్ అయ్యారని హర్షకుమార్ విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు సనాతన ధర్మం(Sanatana Dharmam), తిరుమల లడ్డూ వివాదాలను తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కులాలు, మతాలపై జిమ్మిక్కులు చేయకుండా మంచి పాలన చేస్తే ప్రజలు హర్షిస్తారని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు హర్షకుమార్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed