గుంతకో గండం..ఈ దారికో దండం

by Naveena |   ( Updated:2024-10-06 15:13:58.0  )
గుంతకో గండం..ఈ దారికో దండం
X

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి నుంచి కుర్మిద్ద గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వామ్మో..మేం ప్రయాణించలేమంటుంన్నారు. అడుగుకో గుంతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ద ఆశ్రమం మొదలుకొని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు (దాదాపు ౩౦౦ మీటర్ల మేర) కుర్మిద్ద గ్రామ రహదారి గుంతలమయంగా మారింది. కురుస్తున్న వర్షాలతో..రోడ్డు అధ్వానంగా తయారైంది. కాగా గుంతలు పడిన రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంతల రోడ్లపై అంబులెన్స్‌ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సమయానికి రోగులకు దవాఖానలకు చేర్చ లేకపోతున్నారు. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఎక్కడ చూసినా బురద, గుంతలతో దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో ఓ వైపు వర్షపు నీరు నిలవడం, బురద ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు కూడా తిరుగలేని పరిస్థితి దాపురించింది. గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు వాపోతున్నారు. తాత్కాలిక మరమ్మత్తులైన చేపట్టాలని గతంలో మున్సిపల్ చైర్మెన్, కమిషనర్, ఏఈకి విన్నపించుకున్నా ఈ విషయాన్నీ గాలికి వదిలేశారు. ఇంటి నిర్మాణ అనుమతులకు, ఇంటి పన్నులకు వేలకు వేలు వసులు చేస్తున్నారే తప్పా మున్సిపాలిటిలోని కొన్ని కాలనీలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిచడంలో విఫలమవుతున్నారు. గుంతల రోడ్లకు పాలకులు మరమ్మతులు చేపట్టక పోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల ఇబ్బందులను గుర్తించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story