- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆరు వికెట్ల తేడాతో విజయం
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్( T20 World Cup.)లో భాగంగా 7వ మ్యాచ్ పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఫీల్డింగ్ చేసిన భారత బౌలర్లు పాకిస్తాన్ జట్టుకు బంతితో చుక్కలు చూపించారు. దీంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో గాను 8 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత మహిళల జట్టు మొదటి బంతి నుంచి ఆచితూచి ఆడింది. మొదటి మ్యాచ్ లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా స్వల్ప స్కోరును కూడా జాగ్రత్తగా చేధించింది. పాకిస్తాన్ జట్టు నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలి ఉండగానే చేధించిన భారత మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచుల్లో భారత బ్యాటర్లు షెఫాలి వర్మ 32, జెమిమా 23, హర్మన్ ప్రీత్ కౌర్ 29 పరుగులతో రాణించారు. ఈ విజయంతో గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.