జమ్ముకశ్మీర్ ఎన్నికల బరిలో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ

by Shamantha N |
జమ్ముకశ్మీర్ ఎన్నికల బరిలో నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నితీశ్ కుమార్ జేడీయూ పార్టీ రాజకీయంగా దూకుడు కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా తమ రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. జమ్ముకశ్మీర్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నలభై మంది అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షం కావడంతో తమ పార్టీలో భారీగా చేరికలు జరిగే అవకాశం ఉందని జమ్ముకశ్మీర్ జేడీయూ చీఫ్ షాహీన్ తెలిపారు. ఇప్పటికే అట్టడుగు స్థాయి నుంచి కమిటీల పునర్ వ్యవస్థీకరణ ప్రారంభించామన్నారు. జమ్ముకశ్మీర్ లో తమ పార్టీకి బలం ముందు నుంచే ఉందని.. కానీ నాయకత్వ సమస్యల కారణంగా 2000 తర్వాత పతనమైందన్నారు. ప్రస్తుతం తమ వద్ద వంద మందికి పైగా సర్పంచ్‌లు, మున్సిపల్‌ కమిటీ సభ్యులున్నారని తెలిపారు.

జమ్ములో 90 అసెంబ్లీ స్థానాలు

జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్ లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత బీజేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, జూన్ 2018లో అది కూలిపోయింది. అయితే, ఈసారి ఎన్నికల్లో బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేసుందుకు సిద్ధమైంది. మరోవైపు, జేడీయూ 40 స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed