అయోధ్య స్పెషల్ రైలు పై రాళ్ళ దాడి

by Indraja |
అయోధ్య స్పెషల్ రైలు పై రాళ్ళ దాడి
X

దిశ డైనమిక్ బ్యూరో: అయోధ్యలో దశరథ రాముని ఆలయం రూపుదిద్దుకున్న ఆవిషయం అందరికి సుపరిచితమే. ఇక జనవరి 22 వ తేదీ ప్రాణప్రతిష్ట జరిగిన తరువాత నుండి భక్తులు రాముని దర్శనార్ధం అయోధ్యకు వెళ్తున్నారు. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు రాళ్ళ దాడికి గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 11 వ తేదీ రాత్రి మహారాష్ట్ర లోని నందుర్‌బార్ సమీపంలో అయోధ్యకు భక్తులను తీసుకువెళ్తున్న ప్రత్యేక రైలు పై రాళ్ల దాడి జరిగింది.

దీనితో రైలు లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. రైలులో ప్రయాణిస్తున్న భక్తుడు తెలిపిన సమాచారం ప్రకారం.. నిన్న రాత్రి 10:45 గంటలకు రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా రైలు ఢీకొన్న శబ్దం వచ్చిందని.. అయితే చుట్టూ చీకటిగా ఉండడం వాళ్ళ ఎవరు విసిరారు అనేది తెలియదు అని.. కానీ సిగ్నల్ సమీపంలో రైలు స్లో అయిన సమయంలో ఇలా జరిగిందని తెలిపారు.

ఇక ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో ప్రయాణికులు అందరూ తీవ్ర భయాందోళనకు గురైయ్యారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement

Next Story