- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kolkata: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్‌పైనా వేటు
దిశ, నేషనల్ బ్యూరో : జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న హత్యాచారం జరిగిన తర్వాత కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ పదవిలో డాక్టర్ సుహ్రిత పాల్‌ను నియమించారు. అయితే కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న డాక్టర్లు బెంగాల్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో భేటీలో కొత్త ప్రిన్సిపల్ సహా చాలామంది అధికారుల తీరుపై ఫిర్యాదులు చేశారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ (ఆస్పత్రి సూపరింటెండెంట్) సహా పాలనా విభాగంలోని అధికారులను మార్చాలని కోరారు.
దీంతో బెంగాల్ ఆరోగ్యశాఖ హుటాహుటిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను కూడా బుధవారం పదవి నుంచి తప్పించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ (ఆస్పత్రి సూపరింటెండెంట్)పైనా వేటు వేసింది. ఇక ఈ కేసులో కీలకంగా మారిన మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా నియమిస్తారనే ప్రచారం జరగడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆ కాలేజీలోని ప్రిన్సిపల్ గదికి విద్యార్థులు తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో ఆ కాలేజీకి ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్‌ను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.