చైనా కొత్త మ్యాప్‌పై నిప్పులు చెరిగిన 4 దేశాలు..

by Vinod kumar |
చైనా కొత్త మ్యాప్‌పై నిప్పులు చెరిగిన 4 దేశాలు..
X

న్యూఢిల్లీ : భారత్ సహా పలు దేశాల భూభాగాలను కలుపుకొని చైనా విడుదల చేసిన తప్పుడు మ్యాప్‌పై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. తాజాగా శుక్రవారం భారత్, తైవాన్‌లకు అండగా 4 దేశాలు రంగంలోకి దిగాయి. ఈ మ్యాప్‌లోని సమాచారాన్ని ఖండిస్తున్నామని చైనా సరిహద్దు దేశం వియత్నాం విదేశాంగశాఖ ప్రకటించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని స్వేచ్ఛాయుత జోన్‌లో ఉన్న ఏరియాను కూడా చైనా మ్యాప్‌లో చూపించడాన్ని ఖండిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ వెల్లడించింది.

చైనా దురాక్రమణ వాదానికి ఇది నిదర్శనమని పేర్కొంది. మలేషియా సర్కారు కూడా చైనా వైఖరిని తప్పుపట్టింది. ద‌క్షిణ చైనా స‌ముద్ర ప్రాంతంలోని 80 శాతం ఏరియా (దాదాపు 1800 కిలోమీటర్లు) త‌మ‌దే అని కొత్త మ్యాప్‌లో చైనా ప్రస్తావించడాన్ని తప్పుడు చర్యగా అభివర్ణించింది. చైనా మ్యాప్‌లో తమ దేశం పరిధిలోని సముద్ర జలాలను కూడా చేర్చారని బ్రూనై మండిపడింది.

Advertisement

Next Story