Minister Seethakka: ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వబోతున్నాం

by Gantepaka Srikanth |
Minister Seethakka: ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వబోతున్నాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్ వాడీ(Anganwadis)లకు రాష్ట్ర ప్రభుత్వం గిప్టులు ఇవ్వనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అండన్ వాడీ కేంద్రాలు ఉండగా, ప్రతి టీచర్‌కు, హెల్పర్‌కు రెండు చీరలు చొప్పున ఇవ్వనున్నారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క(Minister Seethakka) రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క(Seethakka) మాట్లాడుతూ.. క్వాలిటీ చీరలు అందించేందుకు చొరవ చూపుతామన్నారు. అమ్మలాగా చిన్నారుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న అంగన్ వాడీ టీచర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఆర్థిక సమస్యలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కానీ అంగన్వాడీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తామన్నారు. రిటర్మెంట్ బెనిఫిట్స్ సాంకేతిక సమస్యలతో ఆలస్యం అవుతున్నాయన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది రోజుల్లో జీవో వస్తుందన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మిస్తామన్నారు. ఉచిత విద్యుత్‌ను అందజేస్తామన్నారు. ఇక మహిళలు స్వేచ్ఛగా పనులకు వెళ్లిందుకే క్రష్‌లు సహాయపడతాయని, దీని వలన మహిళలకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed