- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra: మహాయుతిలో సీఎం కుర్చీపై కొట్లాట లేదు
దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి 'మ్యూజికల్ చైర్' ఉండదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సోమవారంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యారు. అన్ని పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కూటమిలో ముఖ్యమంత్రి పదవికి మ్యూజికల్ ఛైర్ ఉండదు. దానిపై ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఫలితాల తర్వాత మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలు కలిసి తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాయని' చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తాము చేసిన అభివృద్ధిపై దృష్టి సారిస్తామని, తమ కూటమికి రాష్ట్రంలో గెలుపు వాతావరణం సానుకూలంగా ఉందని, సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వాన్ని కొనసాగిస్తాయని ఫడ్నవీస్ వెల్లడించారు. 'ఏక్‌నాథ్ షిండె సహా కూటమిలోని ఎవరూ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదు. నిర్ణయం న్యాయబద్ధంగా ఉంటుందనే విశ్వాసం ఉంద'న్నారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన అధికార వ్యతిరేకత, మహాయుతి కూటమి పనితీరు గురించి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా మహారాష్ట్రలో అధికార కూటమికి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.