- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎస్కేకు ధోనీ ఎప్పటికీ మార్గదర్శకుడే.. రింకీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : టీమిండియా, చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీపై పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ధోని 40 ఏళ్ల వయసులో కూడా యాక్టివ్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడని తెలిపాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో రూ.4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ రివ్యూలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ మాట్లాడుతూ.. కెప్టెన్ అయినా కాకున్నా ధోనీ సీఎస్కేకు ఎల్లప్పుడూ మార్గదర్శకుడిగా ఉంటాడని తెలిపాడు. ‘సీఎస్కే ధోనీని సీజన్ మొత్తం ఆడించకపోవచ్చు. అతనికి విశ్రాంతని ఇవ్వొచ్చు. ధోనీ నుంచి జట్టు ఉత్తమమైన దానిని పొందొచ్చు. ప్రస్తుతం అతను ఇన్నింగ్స్‌లో చివరి 20 బంతులు ఆడుతున్నాడు. అలా చేయడం ద్వారా కూడా ధోనీ ప్రభావం ఎక్కువగానే చూపగలడు.’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
Advertisement
Next Story