- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పత్తి రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఒక్కరోజే 3400 టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. 1474 మంది రైతుల నుంచి స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులంతా పత్తిని ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ చాట్ యాప్ ద్వారా దగ్గరలోని కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, అక్కడే విక్రయించి మద్దతు ధరకు పత్తిని అమ్ముకోవాలని కోరారు. రైతు సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Advertisement
Next Story