ATP Rankings : టాప్-10‌లో చోటు కోల్పోయిన బోపన్న.. 60 వారాల తర్వాత

by Harish |
ATP Rankings : టాప్-10‌లో చోటు కోల్పోయిన బోపన్న.. 60 వారాల తర్వాత
X

దిశ, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్-10 జాబితాలో చోటు కోల్పోయాడు. మెన్స్ డబుల్స్ విభాగంలో 60 వారాలుగా టాప్-10లో కొనసాగిన అతను తాజా ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన 44 ఏళ్ల బోపన్న జనవరిలో మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నం.1 ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ర్యాంక్ కోల్పోతూ వచ్చిన అతను తాజాగా నాలుగు స్థానాలు దిగజారి 5,350 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో నిలిచాడు. మాథ్యూ ఎబ్డెన్‌(ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న ఈ నెలలో ఏటీపీ ఫైనల్స్‌లో ఆడనున్నాడు. మరోవైపు, భారత స్టార్ ప్లేయర్ సుమిత్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరపున టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఒక్క స్థానం ఎగబాకి 83వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రామ్‌కుమార్ రామనాథన్ 309వ స్థానంలో ఉండగా.. ముకుంద్ శశికుమార్ రెండు స్థానాలు ఎగబాకి 365వ ర్యాంక్‌లో నిలిచాడు.

Advertisement

Next Story