- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Canada: సామాజికంగా, రాజకీయంగా జస్టిన్ ట్రూడో 'ఓ ఇడియట్'
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోపై ఆ దేశ మాజీ మంత్రి ఉజ్జల్ దోసంజ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన వ్యవహారంలో ప్రధాని తీరుపై మండిపడుతూ.. సామాజికంగా, రాజకీయంగా కూడా జస్టిన్ ట్రూడో ఒక ఇడియట్. కెనడా విలువల కంటే రాజకీయాలకే అతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు. ట్రూడో విధానం వల్ల ఖలిస్తాని మద్దతుదారులకు మరింత బలం చేకూర్చిందని, మితవాత సిక్కులలో భయాన్ని సృష్టించిందని చెప్పారు. ఇదే సమయంలో జస్టిన్ ట్రూడోతో గతంలో చేసిన చర్చల గురించి ఉజ్జల్ ప్రస్తావించారు. 2008-2011 మధ్య ఇద్దరం ఎంపీలుగా ఉన్నాం. అనేక విషయాలపై చర్చించే సమయంలో ఖలిస్థాని మద్దతుదారులు కూడా తమతో ఉన్నారు. అప్పుడు ట్రూడో ఖలిస్థాని మద్దతుదారుల వాదనకే ఎక్కువ సానుకూలంగా ఉండేవారు. తానొక సామాజికంగా, రాజకీయంగా ఇడియట్ లాంటివాడు. ఈ అభిప్రాయం పట్ల ఎవరేం చెప్పినా పట్టించుకోనని తెలిపారు. దేశ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంతో అతనొక బలహీనవ్యక్తిగా ఉజ్జల్ దోసంజ్ అభివర్ణించారు. సిక్కుల వర్గానికే చెందిన ఉజ్జల్ దోసంజ్ చాలామంది ఖలిస్థాని ఉద్యమానికి మద్దతు ఉండరని, భయంతో మౌనంగా ఉంటారని పేర్కొన్నారు.