US Elections: కమలా హారిస్ గెలుపు కోసం భారత్‌లో పూజలు

by S Gopi |
US Elections: కమలా హారిస్ గెలుపు కోసం భారత్‌లో పూజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎన్నికలవైపే చూస్తోంది. మాజీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కమలా హ్యారిస్ గెలుపు కోసం భారత్‌లోని ఓ గ్రామ ప్రజలు ప్రార్థనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె పూర్వీకులు నివశించిన గ్రామ ప్రజలు అమెరికాలో ఎన్నికలు జరిగే రోజున హిందూ దేవాలయంలో పూజలు చేయనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని, కమలా హ్యారిస్ గెలిస్తే సంబరాలు చేసుకుంటామని స్థానికంగా దుకాణం నడుపుతున్న మణికందన్ అనే గ్రామస్తుడు మీడియాకు చెప్పారు. తులసేంద్రపురం గ్రామం నాలుగేళ్ల క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2020లో కమలా హ్యారిస్ డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా నిలిచిన సమయంలో ఈ గ్రామస్థులు ఆమె గెలవాలని బాణాసంచా కాల్చడం, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, కమలా హ్యారిస్ తండ్రి పీవీ గోపాలన్ వందేళ్ల క్రితం దక్షిణ భారత్‌లోని తమిళనాడులో ఉన్న తులసేంద్రపురం గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత గోపాలన్, అతని కుటుంబం చెన్నైకి వలస వెళ్లారు. అక్కడే ఆయన ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు.

Advertisement

Next Story

Most Viewed