మోడీ ‘గేమర్స్’.. సొట్ట బుగ్గల సుందరి ఎవరని నెటిజన్లు తెగ సెర్చింగ్!

by Ramesh N |   ( Updated:2024-04-14 14:54:25.0  )
మోడీ ‘గేమర్స్’.. సొట్ట బుగ్గల సుందరి ఎవరని నెటిజన్లు తెగ సెర్చింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ ఇటీవల ఆన్‌లైన్ గేమ్స్‌లో ఫేమస్ అయిన కొంతమంది గేమర్లతో ముచ్చటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వీడియో శనివారం ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గేమింగ్ ఇండస్ట్రీ భవిష్యత్తు గురించి ఆయన గేమర్లతో మాట్లాడారు. అయితే ఇందులో ప్రధాని మాట్లాడిన ఏడుగురు ప్రముఖ గేమర్లలో ఓ అమ్మాయి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గేమింగ్ కమ్యూనిటీలో అమ్మాయిలు ఉండటం చాలా అరుదు. మరోవైపు ప్రధానితో ఎంతో బాగా మాట్లాడిన ఈ సొట్ట బుగ్గల సుందరి ఎవరా? అని నెటిజన్లు తెగ వెతికారట.

ఆ ప్రముఖ మహిళా గేమర్ పాయల్ ధరే. ఆమెకు ‘పాయల్ గేమింగ్’ అనే ఛానల్ ఉంది. ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ (ఐజీసీ) లో ఆమె ఒకరు. పాయల్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో పెరిగారు. గేమింగ్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనేది ఆమె కల అని పాయల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె గేమింగ్‌లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని గర్తింపు తెచ్చుకున్నారు.

పాయల్ ధరే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ప్రధాని మోడీతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. భారత్‌లో గేమింగ్ భవిష్యత్తు గురించి చర్చించడానికి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు. కాగా, పాయల్ ధరే‌తో పాటు తీర్థ్ మెహతా, అనిమేష్ అగర్వాల్, అన్షు బిష్ట్, నమన్ మాథుర్, మిథిలేష్ పాటంకర్, గణేష్ గంగాధర్ వంటి ప్రముఖ గేమర్‌లు ప్రధానితో ముచ్చటించారు.

Advertisement

Next Story

Most Viewed