బెంగాల్ లో చెలరేగిన హింసపై ఈసీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్

by Shamantha N |
బెంగాల్ లో చెలరేగిన హింసపై ఈసీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస గురించి జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. హింస నేపథ్యంలో బెంగాల్ లో పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఎన్‌సీడబ్ల్యూ ఛైర్ పర్సన్ రేఖా శర్మ ఈసీని కోరారు. సందేశ్‌ఖాలీ సహా ఇతర ప్రాంతాల్లో మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని నివేదికలు వెలువడ్డాయి. వీటిపైన దర్యాప్తు చేసేందుకు అనుమతివ్వాలని రేఖా శర్మ కోరారు.

ఎన్నికల కోడ్ మినహాయింపు కోరిన ఎన్‌సీడబ్ల్యూ

బెంగాల్ లో మహిళలపై హింస జరుగుతుందని వస్తున్న నివేదికలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రేఖా శర్మ పేర్కొన్నారు. బెంగాల్ లో తమ బృందం పర్యటనను సులభతరం చేసేందుకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని అభ్యర్థించారు. ఎన్‌సీడబ్ల్యూ బృందం ఆన్-ది-గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టేందుకు సిద్ధమైందని తెలిపారు. హింస ప్రభావిత ప్రాంతాల్లోని మహిళల రక్షణ గురించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపోతే, బెంగాల్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈదాడులు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంది.

Advertisement

Next Story