హర్యానా సీఎం అభ్యర్థి ఎన్నిక.. మళ్లి ఆయనకే అవకాశం

by Mahesh |   ( Updated:2024-10-16 08:52:36.0  )
హర్యానా సీఎం అభ్యర్థి ఎన్నిక.. మళ్లి ఆయనకే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎవరు ఊహించని విధంగా గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలు కైవసం చేసుకోగా, ఒక స్వాతంత్ర్య అభ్యర్థితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో బీజేపీ బలం 51 చేరుకుంది. ఇదిలా ఉంటే హర్యానా తదుపరి సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్న తలెత్తింది. పలువురు రాజకీయ విశ్లేషకులు మాత్రం నయాబ్ సింగ్ సైనీ తప్పించి.. అతని స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారనే వాదనను వినిపించారు. కానీ బీజేపీ అధిష్టానం మంత్రం ఈ రోజు జరిగిన సమావేశంలో హర్యానా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా నయాబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. కాగా రేపు ఆయన హర్యానా సీఎంగా రెండోసారి ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీజేపీ కీలక నేతలతో పాటు ఎన్డీయే కూటమిలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయగా రేపు ఉదయం నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆయనను (నయాబ్ సింగ్ సైనీ) బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారని, రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని... నేను అన్ని బాధ్యతలు నిర్వర్తించానని బీజేపీ ఎమ్మెల్యే అనిల్ విజ్ అన్నారు. పార్టీ నాకు అప్పగించిన రేపటి కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed