- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Donald Trump: గ్రీన్ ల్యాండ్ పై అమెరికా కన్ను

దిశ, నేషనల్ బ్యూరో: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకొవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగనే వైట్ హౌజ్ లో నాటో చీఫ్ మార్క్ రట్ తో ట్రంప్ భేటీ అయ్యారు. దీనిపైనే ట్రంప్ మాట్లాడుతూ ‘‘గ్రీన్‌ల్యాండ్ స్వాధీనం సాధ్యమవుతుందని భావిస్తున్నా. అది ఆలోచనే. గతంలో ఈ విషయంపై అంతగా దృష్టిపెట్టలేదు. కానీ, దానికి సహాయకారిగా ఉండే మార్క్ రట్ తో భేటీ అవుతున్నాను. మార్క్ మీకు తెలుసు.. అంతర్జాతీయ భద్రత కోసం అది మాకు అవసరం. దానికోసం చాలామంది తీర ప్రాంతంలో తిరుగుతున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. అయితే చైనా, రష్యాలు ఆర్కిటిక్‌లో కార్యకలాపాలను తీవ్రం చేశాయన్న విషయాన్ని కూడా మార్క్ రట్ అంగీకరించారు. కాకపోతే, గ్రీన్‌ల్యాండ్ వ్యవహారానికి మార్క్‌రట్ దూరంగా జరిగారు.
మార్క్ రట్ ఏమన్నారంటే?
ఈ విషయంపైన మార్క్ రట్ స్పందించారు. ‘‘గ్రీన్‌ల్యాండ్ అమెరికాలో చేరే విషయానికి దూరంగా ఉన్నా. అవును, కాదు అనే విషయాన్ని నేను దూరంగా ఉంచుతున్నా. నా వరకు ఈ చర్చల్లోకి నాటో కూటమిని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇక ఉత్తర ప్రాంతం, ఆర్కిటిక్ విషయంలో మీరు చెప్పింది పూర్తిగా నిజం. ఈ ప్రాంతాన్ని వాడుకోవడం చైనీస్ కు తెలుసు. ఇక రష్యన్లు కూడా ఆయుధాలు సమకూర్చుకొంటున్నారు. మన వద్ద ఐస్‌బ్రేకర్ల కొరత ఉందన్న విషయం నాకు తెలుసు. రష్యా కాకుండా ఏడు దేశాలు అమెరికా నాయకత్వంలో పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని ఆ భాగాన్ని సురక్షితంగా ఉంచడం ముఖ్యం. అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఇకపోతే, మార్చి 10న ట్రంప్ అక్కడి ప్రజలను ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియా పోస్టు చేశారు. గ్రీన్‌ల్యాండ్ ప్రజలు తమ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవడాన్ని అన్నారు. అక్కడి జనాభా కోరుకుంటే అమెరికాలో కూడా చేరొచ్చని ఆఫర్ ఇచ్చారు.
READ MORE ....
Trump: హోలీ వేడుకల్లో ట్రంప్, ఎలాన్ మస్క్!