ఇకపై డిజిటల్‌గా జాతీయ రహదారుల ప్రాజెక్ట్ ఆమోద ప్రక్రియ

by Harish |   ( Updated:2024-04-07 10:33:43.0  )
ఇకపై డిజిటల్‌గా జాతీయ రహదారుల ప్రాజెక్ట్ ఆమోద ప్రక్రియ
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ రహదారులను కాగిత రహితంగా మార్చడానికి రోడ్డు మంత్రిత్వ శాఖ డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ల మంజూరు, ఆమోదం, పనుల వివరాలన్నీ కూడా ఇకపై కొత్త ప్రామాణిక నిర్వహణ విధానం (SoP) ద్వారా నిర్వహించబడుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో అన్ని హైవే ప్రాజెక్ట్‌ల పేర్లు, వాటికి మంజూరైన నిధులు, ఖర్చుతో సహ అన్ని వివరాలను ఈ-ఫైల్‌గా తయారు చేసి అధికారులకు పంపిస్తారు.

ఈ ఫైల్ ప్రాజెక్ట్ జోన్ విభాగాలు అలాగే మంత్రిత్వ శాఖ వద్ద నిర్వహించబడుతుంది, తద్వారా మంజూరైన నిధులు, డేటా, ఇతర అన్ని వివరాలు, ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంటాయి. అలాగే ఫైల్స్‌‌కు ఆమోదం ప్రక్రియ రోజులలో కాకుండా నిమిషాల్లో పూర్తవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రాష్ట్ర ప్రభుత్వాలు, సరిహద్దు రోడ్ల సంస్థ, నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడే అన్ని పనులకు ఈ నెలలో కొత్త SoP తప్పనిసరి చేశారు.

ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలు డిజిటల్‌గా అందరికి అందుబాటులో ఉంటాయి. ప్రాజెక్ట్ జోన్ విభాగం ఈ-ఫైల్‌లో మంజూరు లెటర్, సంతకం చేసిన కాపీతో సహా స్వీకరించిన, ప్రాసెస్ చేయబడిన, మంజూరు చేయబడిన అన్ని డేటా రికార్డులు కూడా డిజిటల‌్‌గా కనిపిస్తాయి. ఈ కొత్త డిజిటైజేషన్ గురించి సంబంధిత వర్గాలకు అవగాహన అందించి మెరుగైన ఫలితాలను తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

Advertisement

Next Story