- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ సర్కారుకు షాక్.. మొన్న మిజోరం.. ఇవాళ నాగాలాండ్.. అసెంబ్లీల కీలక తీర్మానాలు
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నాగాలాండ్ శాసనసభ కీలకమైన తీర్మానం చేసింది. మయన్మార్ బార్డర్‌లో కంచె వేయాలని, ఆ దేశంతో గతంలో కుదిరిన స్వేచ్ఛాయుత రాకపోకల ఒప్పందాన్ని (ఎఫ్ఎంఆర్) రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం నాగాలాండ్ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి 60 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇంతకుముందు బుధవారం రోజు మిజోరం అసెంబ్లీ కూడా స్వేచ్ఛాయుత రాకపోకల ఒప్పందాన్ని (ఎఫ్ఎంఆర్) రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఇప్పుడు ఈ తరహా తీర్మానం చేసిన రెండో రాష్ట్రంగా నాగాలాండ్ అవతరించింది. ఇంతకీ స్వేచ్ఛాయుత రాకపోకల ఒప్పందం (ఎఫ్ఎంఆర్) ఏమిటి.. అనుకుంటున్నారా ? ఈ అగ్రిమెంట్ గతంలో మయన్మార్ , భారత దేశాల మధ్య కుదిరింది. సరిహద్దు ప్రాంతాల్లో 16 కిలోమీటర్ల పరిధిలో రెండు దేశాల ప్రజలు ఎలాంటి పత్రాలు లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు ‘ఎఫ్ఎంఆర్’ ఒప్పందంతో అవకాశం ఏర్పడింది. ఇటీవల కాలంలో మయన్మార్‌లోని సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు మిలిటెంట్ ఉద్యమాన్ని మొదలుపెట్టాయి. ప్రస్తుతం మిలిటెంట్ గ్రూపులదే పైచేయిగా మారడంతో మయన్మార్ సైనికులు, సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇది దేశ భద్రతకు ముప్పు అని పరిగణించిన భారత సర్కారు.. ఎఫ్ఎంఆర్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మయన్మార్ బార్డర్‌లో కంచె నిర్మిస్తామని వెల్లడించింది. ఇప్పుడు ఈ నిర్ణయాలనే మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.