- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా కుమారుడు ఎంపీగా ఓడిపోవాలి: కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలోని పతనంతిట్ట లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన తన కుమారుడు అనిల్ ఆంటోనీ ఓడిపోవాలని అన్నారు. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడి పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని గెలిపించండి’ అని తెలిపారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీలో చేరడం తప్పు అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీనే నా మతం అని స్పష్టం చేశారు. హస్తం పార్టీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుందని తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడతానని స్పష్టం చేశారు. జాతీయ సమస్యలను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు ఆంటోనీ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ పోరాడేది వాటిపైనేనని వెల్లడించారు. ‘ఇండియా కూటమి ప్రతిరోజూ ముందుకు సాగుతోంది. బీజేపీ పతనమవడం ఖాయం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది మాకు ఒక అవకాశం అని నేను భావిస్తున్నా’ అని చెప్పారు. కాగా, అనిల్ ఆంటోనీ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.