PM Modi : మాల్యా, నీరవ్‌లను అప్పగించండి.. బ్రిటన్ ప్రధానిని కోరిన మోడీ

by Sathputhe Rajesh |
PM Modi : మాల్యా, నీరవ్‌లను అప్పగించండి.. బ్రిటన్ ప్రధానిని కోరిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు అప్పగించాలని యూకే పీఎం కీర్ స్టార్మర్‌ను ప్రధాని మోడీ కోరారు. జీ20 సదస్సులో భాగంగా పలువురు కీలక నేతలతో మోడీ భేటీ అవుతున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు సంబంధించి మాల్యా రూ.9వేల కోట్లను ఎగ్గొట్టి 2016 నుంచి యూకేలో ఉంటున్నారు. రూ.13వేల కోట్లకు సంబంధించి పంజాబ్ నేషన్ బ్యాంకు స్కామ్ కేసులో నీరవ్ మోడీ నిందితుడిగా ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాల్యా, నీరవ్ మోడీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని యూకే ప్రభుత్వాన్ని కోరుతోంది. దీంతో పాటు విదేశాల్లో వారి ఆస్తులను గుర్తించాలని కోరింది. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ(ఎంఎల్ఏటీ) ప్రకారం.. భారత్-యూకే నేర పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed