ఎర్రకోటపై ప్రసంగంతో చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ

by Mahesh |
ఎర్రకోటపై ప్రసంగంతో చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ భారత్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రసంగంతో ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. భారత దేశ చరిత్రలోనే ఎర్రకోటపై అత్యధికంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి తన పేరుపై ఉన్న రికార్డును తాను తిరగ రాసుకున్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన అధికారంలోకి వచ్చిన మోడీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. 2014లో మోదీ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని 65 నిమిషాల పాటు చేశారు. అలాగే 2015లో దాదాపు 88 నిమిషాల పాటు 2018లో 83 నిమిషాల పాటు ప్రసంగించారు. తదనంతరం 2019లో దాదాపు 92 నిమిషాలు మాట్లాడారు. 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు, 2022 లో దాదాపు 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు.. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేసిన 11వ ప్రసంగంలో ఏకంగా 98 నిమిషాల పాట ప్రసంగించి మనకు ఎవ్వరు సాటి లేరని నిరూపించారు. అయితే 1947లో జవహర్‌లాల్ నెహ్రూ 72 నిమిషాలు, 1997లో ఐకే గుజ్రాల్ 71 నిమిషాలు పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే నెహ్రూ, ఇందిర 1954, 1966లో కేవలం 14 నిమిషాలు మాత్రమే ప్రసంగించగా ఇదే ఇప్పటికి వరకు భారత ప్రధానులు అతి తక్కువ ప్రసంగ సమయం గా నిలిచిపోయింది.

Advertisement

Next Story