విద్యా వ్యవస్థను మోడీ ప్రభుత్వం మాఫియాకు అప్పగించింది: ప్రియాంక గాంధీ

by Harish |
విద్యా వ్యవస్థను మోడీ ప్రభుత్వం మాఫియాకు అప్పగించింది: ప్రియాంక గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోడీ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పగించారని దానిని అవినీతి మయం చేశారని ప్రియాంక ఆరోపించారు. దేశ విద్యను, పిల్లల భవిష్యత్తును అత్యాశపరులకు, మతోన్మాద అసమర్ధులకు అప్పజెప్పాలన్న రాజకీయ మొండితనం, దురహంకారం వల్ల పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దు కావడం జరిగాయి. అలాగే, క్యాంపస్‌ల నుంచి విద్య మాయమవడం, విద్యలో రాజకీయ గూండాయిజం పెరగడం ఎక్కువ అయ్యాయని ఆమె అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. నేడు యువత భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద అడ్డంకిగా మారింది. దేశంలోని సమర్ధులైన యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని బీజేపీ అవినీతిపై పోరాడేందుకు వృధా చేస్తున్నారు, మోడీ మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ప్రియాంక అన్నారు.

పరీక్షలను నిర్వహించే బాధ్యత కలిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరును సమీక్షించడానికి, పరీక్షా సంస్కరణలను సిఫార్సు చేయడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన ఒక రోజు తర్వాత ఆమె నుంచి ఈ విధమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించిన కేంద్రం శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను కూడా తొలగించింది.

Advertisement

Next Story

Most Viewed