Kerala MLA: గంజాయి కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్! వార్తలను ఖండించిన ఎమ్మెల్యే

by Ramesh N |
Kerala MLA: గంజాయి కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్! వార్తలను ఖండించిన ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ అయినట్లు కలకలం రేపుతోంది. సీపీఐ(ఎం) పార్టీ ఎమ్మెల్యే యు. ప్రతిభ కొడుకును గంజాయి కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కొడుకుతో పాటు మొత్తం తొమ్మిది మంది యువకులను అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అలప్పుజ జిల్లాలోని కుట్టనాడులో గంజాయి సిగరెట్లు తాగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. తకాజి ​​బ్రిడ్జ్ పరిధిలో ఉన్న ఓ గ్రూపు నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. వారి వద్ద గంజాయి ఉన్నందుకే అరెస్ట్ చేశామని తెలిపింది. కానీ అది చాలా తక్కువ మోతాదు ఉండటంతో వారినీ బెయిల్ పై విడుదల చేశామని పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నామని ఎక్సైజ్ అధికారి స్పష్టం చేశారు.

అయితే, ఈ వార్తలు మీడియా ప్రసారం చేయడంతో ఎమ్మెల్యే ప్రతిభ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు అరెస్టు కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. తన కొడుకు అతడి స్నేహితులతో కలిసి కూర్చున్న సమయంలో ఎక్సైజ్ అధికారులు అక్కడికి వచ్చారని, అందరితో పాటు తన కొడుకును కూడా ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. ఈ వార్తలు చూసి తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపింది. మీడియా తనను అకారణంగా టార్గెట్ చేస్తోందని, ఈ వార్త నిజమైతే తానే క్షమాపణలు చెబుతానని, లేదంటే తనకు మీడియా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నిరాధార కథనాలను ఇప్పటికైనా ఆపేయాలని కోరారు. అదేవిధంగా తను అరెస్ట్ కాలేదని ఎమ్మెల్యే కొడుకు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed