- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ కుంభకోణానికి ముగింపు పలకాలి- ఎంకే స్టాలిన్
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన నీట్- యూజీ 2024 పరీక్షపై రాజకీయంగా దుమారం రేగుతోంది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నీట్ కుంభకోణానికి ముగింపు పలకాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరూ దోచుకోలేని ఆస్తి చదువు అని అన్నారు. కానీ, అందులోనూ నీట్ లాంటి పరీక్షల్లో మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నీట్ లో అక్రమాలు జరుగుతున్నాయని మొదట చెప్పింది తామే అని గుర్తుచేశారు. ఇప్పుడు దేశం మొత్తం తమ వ్యాఖ్యలను సమర్థిస్తుందన్నారు. ఎలాంటి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కావద్దన్నారు.
కేంద్రసర్కారుపై కాంగ్రెస్ ఫైర్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీల ద్వారా కేంద్రం నీట్ కుంభకోణాన్ని కప్పిపుచ్చుతోందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నీట్ పేపర్ లీక్ కానప్పుడు.. బిహార్‌లో పేపర్ లీక్ పేరిట 13 మందిని ఎందుకు అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. గుజరాత్‌లోని గోధ్రాలో చీటింగ్ రాకెట్ గుట్టురట్టు కాలేదా? అని అడిగారు. మోడీ సర్కారు ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందా? అని మండిపడ్డారు. ఎన్టీఏను దుర్వినియోగం చేసి దాదాపు 24 లక్షల మంది యువతతో ఆటలాడుతున్నారని ఫైర్ అయ్యారు. మార్కులు, ర్యాంకుల్లో రిగ్గింగ్ జరిగిందని.. రిజర్వ్ డ్ సీట్లకు కటాఫ్ పెరిగిందన్నారు. మెరిట్ స్టూడెంట్లు ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు పొందకుండా చేసేందుకే ఇదంతా కేంద్రం చేసినట్లు కన్పిస్తోందన్నారు. నీట్ అవకతవకలు.. ‘వ్యాపమ్ 2.0’ అని కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జి పవన్ ఖేడా విమర్శించారు. విద్యార్థుల ఆగ్రహం, నిరసనలు, కోర్టు కేసుల్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చులకనగా చూశారని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను బీజేపీ నాశనం చేస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.