- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కుట్ర: మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలనను తీసుకురావడానికి కుట్రలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారు, సీఎం ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు, ఢిల్లీలో అధికారులను నియమించడం లేదు, బదిలీలు, పోస్టింగ్‌లు లేవు, గత కొన్ని రోజులుగా ఎల్‌జీ ఎంహెచ్‌ఏకు నిరాధారమైన లేఖలు రాస్తున్నారు. ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసినట్లుగా ఉంది. మొత్తంగా ఈ సంకేతాలను చూస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి దేశరాజధానిలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుంది. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన "చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని ఆమె పేర్కొంది.
ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు, బీజేపీ చేస్తున్న ఈ కుట్రలు ఢిల్లీ ప్రజల ఆదేశానికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాషాయ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని ఆమె విలేకరుల సమావేశంలో అన్నారు. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ తొలగించిన ఒక రోజు తర్వాత, మంత్రి అతిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.