Meghalaya barder: సరిహద్దులో పశువుల అక్రమ రవాణాకు యత్నం..అడ్డుకున్న బీఎస్ఎఫ్

by vinod kumar |
Meghalaya barder: సరిహద్దులో పశువుల అక్రమ రవాణాకు యత్నం..అడ్డుకున్న బీఎస్ఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మేఘాలయాలోని అంతర్జాతీయ సరిహద్దులో పశువుల అక్రమ రవాణా చేస్తుండగా బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) దళాలు అడ్డుకున్నాయి. పశ్చిమ గారో హిల్స్ వద్ద దలు గ్రామ సమీపంలో నాలుగు వాహనాల్లో లోడ్ చేసిన 69 పశువులను రక్షించారు. ఆరుగురు భారత పౌరులను అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు మేఘాలయా పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ పశువులను బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలించడానికి నిందితులు ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులు, పట్టుబడిన వ్యక్తులను తదుపరి చర్యలు నిమిత్తం డాలులోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా , ఈ నెల మొదటి వారంలో ఉత్తర త్రిపుర జిల్లాలోని ధర్మనగర్ సబ్ డివిజన్‌లోనూ ఓ భారీ పశువుల స్మగ్లింగ్ ఆపరేషన్‌ను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed