రాళ్లు తేలిన దారులు .. నోళ్లు తెరిచిన గుంతలు..

by Aamani |
రాళ్లు తేలిన దారులు .. నోళ్లు తెరిచిన గుంతలు..
X

దిశ, నారాయణఖేడ్: పట్టణమే కాదు.. పల్లెల్లో రహదారులు గుంతల మాయా మయ్యాయి. తారు, సిమెంట్ పోయి వాహనదారుల ఒళ్ళు హూనం చేస్తున్నాయి. తీరు తెన్నూ లేని రోడ్ల మీద ప్రయాణం తో వాహనాలు దెబ్బతింటున్నాయి. పెరిగిన పెట్రో ధరలకు ఈ ఖర్చు కలిసి చేతి చమురు వదులుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గ్రామాలకు వెళ్లే రోడ్లు అక్కడక్కడ ప్రధాన రహదారులు అధ్వానం గా మారాయి. సంవత్సరాల గడుస్తున్న యంత్రాంగం వాటిని బాగు చేయకపోవడంతో ప్రజలు నిత్యం నరకం చూపిస్తున్నాయి. నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలో ప్రధాన రహదారులు సొగసు ఇదే...

నారాయణఖేడ్ బైపాస్ నుంచి ముదిరాజ్ భవన్ వరకు పది సంవత్సరాల గడుస్తున్నప్పటికీ సిసి రోడ్డు వేయకపోవడంతో నరకయానంగా మారింది. చిన్నపాటి వర్షానికి రోడ్డు ఎక్కడికక్కడే మురుకి నీరు నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనదారులకు పాదాచారులకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో వాటిలో మురికి నీరు నిలుస్తుంది. దీంతో పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. నరకం అనుభవిస్తున్న రహదారులు పట్టణంలోని పలుచోట్ల పరిశీలిస్తే వాన దారులు నరకం అనుభవిస్తున్నారు.ఇటీవల మున్సిపల్ అధికారులు గుంతల్లో డస్ట్ వేసి పుడిచినప్పటికీ తిరిగి వర్షాలకు కురియడంతో యదా స్థితిలో వచ్చాయి. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రెండు సార్లు శంకుస్థానం చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదు, ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు చొరవ తీసుకొని రోడ్లను పూర్తిస్థాయిలో వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. డివిజన్ కేంద్రం కావడంతో చుట్టూ దిక్కున మండలాలు, గ్రామాల వారు పిల్లల ఉన్నంత చదువుల కొరకు నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పట్టణ జనాభా 40 నుంచి 50 వేలకు చేరినట్లు తెలుస్తుంది. కొద్దిపాటు పనులు జరిగిన, అందుకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణ, డ్రైనేజీ వ్యవస్థ సవ్యంగా లేకపోవడంతో తరచూ నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి మంగల్ పేట్ బస్టాండ్ వరకు డివైడర్ నిర్మించినప్పటికీ రెండు వైపులా రోడ్డు వెడల్పు లేకపోవడంతో పెద్ద పెద్దగా వాహనాలు రావడంతో రోడ్డు గుంతలు గుంతలు గా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలోని గ్రామాలకు వెళ్లాలంటే జనం జంకాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల ప్రభుత్వ నిధులు కేటాయించిన టెండర్ కు గుత్తే దారులు ముందుకు రావడం లేదు. మరికొన్నిచోట్ల టెండర్ జరిగినా గుత్తేదారులు పనులు ప్రారంభించిన పరిస్థితి. ఏళ్లుగా ఎవరు పట్టించుకోకపోవడంతో గుంతలు, కంకర తేలిన రోడ్లపై నడకన నరకయాతన పడుతున్నారు. జిల్లాలోనే మారుమూల ప్రాంతమైన ఉన్న మండలమైన మనూర్, నారాయణఖేడ్, నాగల్ గిద్ద , సిర్గాపూర్ మండలాల్లో కొన్ని రహదారులు అధ్వానంగా మారాయి. రాత్రిపూట ప్రయాణం చేస్తే ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం కలగడం లేదని ఆయా మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల ఆర్ అండ్ బి రోడ్డు పాడైంది. ఉసిర్కపల్లి , ధన్వార్ తదితర గ్రామాల శివారులో రోడ్డుకు గుంతలు పడ్డాయి. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు తంటలు పడుతున్నారు. నారాయణఖేడ్ నుంచి నాగల్ గిద్ద నుంచి రహదారుల వరకు ఆరేళ్ల కిందట రూ.10 కోట్లతో రెండు వరుసల రోడ్డుకు బీటీ నిర్మించారు. అప్పట్లో గుత్తేదారు నాణ్యతగా పనులు చేపట్టకపోవడంతో రోడ్డు అద్వానంగా మారింది.

దీని మరమ్మత్తులకు నిధులు విడుదల చేసినప్పటికీ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. నాగల్ గిద్ద మండలంలో కారముంగి, ఇరాక్ పల్లి, ఉట్టుపల్లి, ఎనాక్ పల్లి, గొందే గామ్ ,గూడూర్, మైయినెల్లి , షికార్ ఖానా , రామచంద్రనాయక్ తండా, కొండ నాయక తండా, నారాయణఖేడ్ మండలంలో హగిర్గా కే, అక్లాయి తాండ, కంజీపూర్ , అనంతసాగర్, అబ్బేంద, కొండాపూర్ రోడ్లు అధ్వానంగా మారాయి. మనూరు మండలంలో బోరంచ, ఎల్గొయి ,ఎన్ జి హు క్రేన్ గుంతలుగా కనిపిస్తున్నాయి. సిర్గాపూర్ బీబీపేట్ మీదుగా మాసాన్ పల్లి హైవే వరకు, గుంతలుగా మారాయి. ముబారక్పూర్ పూర్తి అధ్వానంగా మారింది. తదితర గ్రామాల రోడ్లు కంకర తేలింది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి రోడ్లను పట్టించుకునేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story