ఇది అనూహ్య ఫలితం.. దీనిని మేము అంగీకరించలేము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా

by Mahesh |   ( Updated:2024-10-08 12:37:21.0  )
ఇది అనూహ్య ఫలితం.. దీనిని మేము అంగీకరించలేము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానా ఎన్నికల ఫలితాల(HaryanaElectionResult,)పై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మొత్తం తలకిందులు అయ్యాయి. హర్యానాలో బీజేపీ(BJP) ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వస్తుందని అంచనా వేసిన వారికి ప్రజలు తీర్పు షాక్ ఇచ్చింది. కాగా ఈ ఎన్నికల్లో గతం కంటే మరో 9 స్థానాలను అధికంగా గెలుచుకున్న బీజేపీ.. 49 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది. కాగా ఈ హర్యానా ప్రజలు ఇచ్చిన తీర్పుపై.. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా(Pawan Khera) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఒక లైన్‌లో చెప్పాలంటే, ఇది వ్యవస్థ యొక్క విజయం.. ప్రజాస్వామ్యం యొక్క ఓటమి.. మేము దీనిని అంగీకరించలేము. మేము ఫిర్యాదులు సేకరిస్తున్నాము. మా అభ్యర్థులు ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఇచ్చారు. రిటర్నింగ్ అధికారులు రాబోయే రోజుల్లో ఈ ఫిర్యాదులన్నింటితో ఎన్నికల కమిషన్‌కు వెళ్లి అక్కడ మా ఫిర్యాదును నమోదు చేస్తామని.. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story