- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన..
దిశ, మంథని : మంథని డిపోలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో 11 మంది ప్రయాణికులు తమ సూచనలను, సలహాలను తెలియజేశారని తెలిపారు.ముఖ్యంగా ఇద్దరు ప్రయాణికులు జమ్మికుంట,బోర్ల గూడెం రూట్లలో పాత సర్వీసులను పునరుద్దరించమని చెప్పారు.దానికిగాను డిఎం కొత్త బస్సులు వచ్చిన పిదప అధికారుల సూచనల మేరకు కొత్త సర్వీసులు ఆపరేటర్ చేస్తామని తెలిపారు.
రాత్రి 9 గంటల తర్వాత కరీంనగర్ నుండి మంథనికి బస్సులు ఉండే విధంగా చూడమని కోరగా ఇప్పుడు ఉన్న సర్వీసుల సమయం చూసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు.అదే విధంగా సెంటినరీ కాలనీలో మూడు స్టాప్ ల వద్ద సూపర్ లగ్జరీ సర్వీసును ఆపమని ప్రయాణికుడు కోరగా ఎక్స్ప్రెస్ ,పల్లె వెలుగు బస్సులు మూడు చోట్ల ఆగుతున్నాయి.సూపర్ లగ్జరీ కూడా రెండు చోట్ల ఆగే విధంగా సిబ్బందికి సూచనలు ఇస్తామని చెప్పడం జరిగింది. మంథని తాడిచర్ల రూట్ లో ఇప్పుడు నడిచే రెండు బస్సులు కాకుండా ఇంకా రెండు సర్వీసులు కోరగా కొత్త బస్సులు వచ్చాక ఇంకొక సర్వీస్ ఆపరేట్ చేసే విధంగా చూస్తామని తెలపడం జరిగిందని తెలిపారు.