ఒడిశాలో మావోయిస్టు మృతి: కంధమాల్ జిల్లాలో ఘటన

by samatah |
ఒడిశాలో మావోయిస్టు మృతి: కంధమాల్ జిల్లాలో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని కంధమాల్ జిల్లా కాకేర్‌కుపా అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం జరిగిన ఎదురు కాల్పల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మరణించిన మావోయిస్టును ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దస్రుగా గుర్తించారు. ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి చెందిన కంధమాల్-కలహండి-బౌధ్-నాయగర్ (కేకేబీఎన్) డివిజన్‌ కమిటీ సభ్యుడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. దస్రుపై 5లక్షల రివార్డు సైతం ఉంది. భద్రతా దళాలపై దాడులు, అనేక సంఘటనలలో దస్రు పాల్గొనగా.. కంధమాల్‌, బౌద్‌ జిల్లాల్లో 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒడిశాలోని ఎలైట్ యాంటీ నక్సల్ ఆపరేషన్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారి నేతృత్వంలో కంధమాల్ జిల్లా వాలంటరీ ఫోర్స్ కమాండోలతో కూడిన పోలీసు పార్టీ శనివారం కాకేర్ కుపా ప్రాంతానికి వెళ్లగా అక్కడే ఎదురు కాల్పులు జరిగినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్‌ కూడా గాయపడగా వెంటనే.. బెర్హంపూర్ పట్టిణంలోని ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఘటన ప్రాంతంలో ఒక 303 రైఫిల్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story