మహిళలపై నేరాల పట్ల చాలా రాష్ట్రాలు కఠినంగా లేవు: రాజ్‌నాథ్ సింగ్

by Harish |
మహిళలపై నేరాల పట్ల చాలా రాష్ట్రాలు కఠినంగా లేవు: రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కేంద్రం కఠిన వైఖరిని అవలంబిస్తున్నప్పటి చాలా రాష్ట్రాలు ఆ దిశగా చిత్తశుద్ధి చూపించడం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కోల్‌కతా హత్యాచారం ఘటన హృదయ విదారకరమైనది. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని పేర్కొంటూ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలను చూసినట్లయితే, ఇంకా ఎంతో చేయాల్సిందిగా అనిపిస్తుంది. అత్యాచారం వంటి నేరాలకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించాము. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి, కానీ చాలా రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా రక్షణ మంత్రి తెలిపారు.

ఇదే కార్యక్రమంలో భేటీ బచావో-భేటీ పడావో కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిలో స్త్రీల భాగస్వామ్యం ఎక్కువగా పెరిగిందని అన్నారు. మరోవైపు కోల్‌కతా హత్యాచారం ఘటనపై పశ్చిమబెంగాల్‌లో నిరసనలు ఉదృతంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ తన ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది. ఇండియా కూటమిలోని నాయకులు సైతం ఆమెను తప్పుపడుతున్నారు. బెంగాల్ కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed