- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manish Sisodia : నేను బయటికొచ్చా..కేజ్రీవాల్ కూడా బయటికొస్తారు :మనీశ్ సిసోడియా
దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. నగరంలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని వీధుల్లో పాదయాత్ర చేస్తూ ప్రజలను ఆయన కలిశారు. ఈసందర్భంగా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో పాదయాత్ర వివరాలను మనీశ్ సిసోడియా వెల్లడించారు.
‘‘ఇన్నాళ్లు ఢిల్లీ ప్రజలు జైలులో ఉన్న నాకోసం ప్రార్థించారు. నేను జైలు నుంచి బయటికి వచ్చాను. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రార్థిస్తున్నారు. ఆయన కూడా జైలు నుంచి బయటికొస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. 17 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రజలను కలుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పాదయాత్ర సందర్భంగా మహిళలు తనకు రాఖీ కడుతుంటే ఎంతో ఎమోషనల్‌గా ఫీలయ్యానని మనీశ్ సిసోడియా చెప్పారు. రాబోయే కొన్ని నెలల్లో ఢిల్లీ పరిధిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.