Manipur: మణిపూర్ అనుమానిత మిలిటెంట్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

by S Gopi |
Manipur: మణిపూర్ అనుమానిత మిలిటెంట్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీ (యూకేఎన్ఏ) క్యాడర్‌గా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని గౌహతిలో అతను దాక్కున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మణిపూర్‌లోని చురచంద్‌పూర్ జిల్లాకు చెందిన ఎల్ఎస్ యోసెఫ్ చొంగ్లోయ్ (34)గా గుర్తించిన వ్యక్తి మణిపూర్ రాష్ట్రంలో, అస్సాం సరిహద్దు ప్రాంతాల్లో వివిధ విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అసోం పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ పార్థ సారథి మహంత మాట్లాడుతూ.. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించామని, అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశామని చెప్పారు. 'గౌహతిలోని బసిస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్టోలా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాం. ఓ వ్యక్తిని పట్టుకున్నామని ' సారథి మహంత చెప్పారు. చోంగ్లోయ్ మిలిటెంట్ గ్రూప్ యూకేఎన్ఏ ఆర్థిక కార్యదర్శి. అతను మణిపూర్, అస్సాం సరిహద్దు ప్రాంతాలను కవర్ చేసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్టు మహంత వెల్లడించారు. నేషనల్ హైవే సపెర్మైనా వంతెనను ధ్వంసం చేసిన బాంబు పేలుడు, మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్ వద్ద ఐఓసీఎల్ కాన్వాయ్‌పై సాయుధ దాడితో సహా ఇటీవలి కార్యకలాపాలలో అతను పాల్గొన్నట్లు తెలిసింది. యూఏపీఏ చట్టం సహా వివిధ సెక్షన్‌లపై అతని మీద కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story