- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > Mamata Banerjee : మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు.. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నారంటే..?
Mamata Banerjee : మమతా బెనర్జీకి కూటమి బాధ్యతలు.. లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నారంటే..?
by Sathputhe Rajesh |

X
దిశ, నేషనల్ బ్యూరో : వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఇండియా కుటమిని నడిపించే అవకాశం ఇవ్వాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ మమతా బెనర్జీని ప్రతిపక్ష నేతగా అంగీకరించాలని సూచించారు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. మమతా బెనర్జీతో సహా ఏ నేతకు ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించిన తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే కూటమిలో ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మమతా బెనర్జీ ఈ నెల 6న మాట్లాడుతూ.. ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. సీఎం పదవితో పాటు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తానని టీఎంసీ అధినేత అన్నారు.
Next Story