- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్రం వేధిస్తోంది.. అభద్రత వెంటాడుతోంది.. దీదీ సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి భద్రత లేదని ఆరోపించారు మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల కోసం కుమార్ గంజ్ టీఎంసీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి బిప్లబ్ మిత్రా తరుపున ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోనే దీదీ ప్రసంగించారు. బీజేపీ తనను, తన మేనల్లుడిని టార్గెట్ చేస్తోందన్నారు. రాష్ట్రంలో తమకు భద్రత లేదన్నారు. అయితే బీజేపీ కుట్రలకు మేం భయపడమని అన్నారు. టీఎంసీ నాయకులు.. రాష్ట్ర ప్రజలపై కుట్ర జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నానని ప్రకటించారు.
సోమవారం ఓ అంశం టీఎంసీని, ఆ పార్టీ అగ్రనేతల్ని కుదిపేస్తుందంటూ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లపైనే మమతా బెనర్జీ స్పందించారు. సువేందు అధికారి వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ ‘తన కుటుంబాన్ని అక్రమ సంపదను కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన ఒక దేశద్రోహి ఉన్నాడు. అతని తాటాకు చప్పుళ్లకు మేం బెదరమని స్పష్టం చేశారు. తమ ఎదురుదాడి పీఎం కేర్ ఫండ్, ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేసే జుమ్లా అని అన్నారు. సువేందు అధికారి అసత్యాన్ని మాత్రమే ప్రోత్సహిస్తాడని మండిపడ్డారు.
ఇకపోతే, దూరదర్శన్ లోగో రంగు మారడం గురించి బీజేపీపై మండిపడ్డారు దీదీ. దూరదర్శన్ వంటి స్వతంత్ర సంస్థలకు మోడీ ప్రభుత్వం.. కాషాయ రంగులు పూస్తోందన్నారు. దేశంలోని సన్యాసులు, ఆధ్యాత్మిక నాయకులు యుగయుగాలుగా చేసిన త్యాగాలను అవమానిస్తుందని మండిపడ్డారు. డీడీ లోగో అకస్మాత్తుగా కాషాయ రంగులోకి ఎందుకు మారింది? అని ప్రశ్నించారు. ఆర్మీ సిబ్బంది అధికారిక నివాసాలకు ఎందుకు కాషాయం రంగు వేశారు? అని అడిగారు. వారణాసిలో పోలీసుల యూనిఫాంను ఎందుకు కాషాయంగా మార్చారు? అని దీదీ ప్రశ్నల వర్షం కురిపించారు.
డీడీ లోగో రంగును మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు బెంగాల్ సీఎం. ఇది బీజేపీ నిరంకుశ పాలనకు మరో ఉదాహరణ అని అన్నారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. భవిష్యత్తులో ఇకపై ఎన్నికలు ఉండవని అన్నారు. ఒక వ్యక్తి, ఒకే పార్టీ ఉంటుందని మండిపడ్డారు. పాలన సహా వివిధ వర్గాల మతపరమైన హక్కులు ప్రమాదంలో పడతాయని విమర్శించారు మమతా బెనర్జీ.