ఆ రెండు షరతులు పాటిస్తే ‘ఇండియా’కు మద్దతు : దీదీ

by Shamantha N |
ఆ రెండు షరతులు పాటిస్తే ‘ఇండియా’కు మద్దతు : దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓడిపోయి, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాము బయట నుంచి మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు.

“ఇండియా కూటమికి మద్దతు అందిస్తాం. బయటి నుండి వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తాం. కేంద్రానికి మద్దతు ఇస్తే.. బెంగాల్‌లోని మహిళలు వంద రోజుల పని పథకంలో సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు” అని మమతా అన్నారు. అయితే, ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని అంటూనే.. అందులో అధిర్ రంజన్ చౌదరి నేతృత్వంలోని బెంగాల్ కాంగ్రెస్, బెంగాల్ సీపీఎం ఉండబోదని స్పష్టం చేశారు. ఆ షరతులకు ఒప్పుకుంటేనే మద్దతిస్తామని ప్రకటించారు.

దేశంలోని 70 శాతం సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో దీదీ ఇండియా కూటమివైపు మొగ్గుచూపారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగుతుండగా.. బెంగాల్ లోని 42 లోక్ సభ స్థానాలకు ప్రతి దశలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో తరచూ మోడీ అమిత్ షా పర్యటిస్తూ.. 42 స్థానాలపై దృష్టి సారించారు.

Advertisement

Next Story