- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీదీ కారుకు తృటిలో తప్పిన ప్రమాదం.. తలకు స్వల్ప గాయం
దిశ, నేషనల్ బ్యూరో : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురైంది. బుధవారం ఆమె బుర్ద్వాన్ జిల్లా పర్యటన ముగించుకొని కారులో కోల్‌కతాకు బయలుదేరారు. మార్గం మధ్యలో దీదీ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి మరో వాహనం వైపుగా దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ సడెన్ బ్రేకు వేసి దాన్ని ఆపడంతో ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా కారుకు బ్రేక్ వేయడంతో దీదీ ఒక్కసారిగా ముందుకు ఒరిగి.. ఎదురుగా ఉన్న విండ్‌షీల్డ్ భాగానికి ఆమె తల తాకింది. దీంతో దీదీ తలకు స్వల్ప గాయమైంది. బుర్ద్వాన్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ బుధవారం ఉదయం హెలికాప్టర్‌లో వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె రోడ్డుమార్గంలో కోల్‌కతాకు బయలుదేరారు. ప్రభుత్వ కార్యక్రమం ముగించుకొని బయలుదేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించిన ప్రతిసారీ..ముందు భాగంలోనే కూర్చోవడం దీదీకి అలవాటు. కోల్‌కతాకు చేరుకున్న తర్వాత దీదీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోనున్నారు.